తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోగా.. వైఎస్ జగన్ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ సీనియర్ లీడర్ దేవినేని ఉమ విమర్శించారు. అప్పుల కోసం జగన్ సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ ఫేక్ అంటూ ఆరోపించారు. జీఎస్టీపీ ఫేక్.. తలసరి ఆదాయం ఫేక్.. ఇలా అన్నీ తప్పుడు లెక్కలతో ప్రజలను, కేంద్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో ప్రస్తుతం అభివృద్ధి లేదు.. పాలకులు బిల్లులు చెల్లించరని దేవినేని ఉమ ఆరోపించారు. చెల్లించాల్సిన బిల్లులన్నీ పెండింగ్ లోనే ఉంటే ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసమని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్ సర్కారు అప్పు చేసి తీసుకొచ్చిన పది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ నిలదీశారు.