తెలంగాణ వీణ . ఏపీ బ్యూరో : నియోజకవర్గం నలుమూలల నుంచి అశేషజనం తరలిరావడంలో కడప నగరం జనసంద్రమే అయింది. సామాజిక సాధికారయాత్ర వెంట వేలాదిగా జనం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. డిప్యూటీ సీఎం, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఆధ్వర్యం జరిగిన సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ రేష్‌సుబాబు, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీ పోతుల సునీతలతో పాటు పలువులు ఎమ్మెల్సీలు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, కార్పొరేషన్ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నత స్థాయే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ప్రభుత్వం. కడప జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ.7,984.48 కోట్లు అందించారు. అందులో ఎస్సీలకు రూ.2000.92 కోట్లు, ఎస్టీలకు రూ.212.47 కోట్లు, మైనార్టీలకు రూ.508 కోట్లు అందాయి. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే.. అది మనపై జగనన్నకు ఉన్న ప్రేమకు నిదర్శనం! ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడుపుతున్న జగనన్నకు మనమంతా అండగా ఉందాం.’
నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు..
‘మనమంతా జగనన్న కుటుంబసభ్యులం. సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా పేదలకు అందేలా చేస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. మధ్య దళారులు లేకుండా చేయడం ద్వారా, పథకాలు పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా చేయడం జగనన్న లక్ష్యం. నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసం జగనన్న అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అణగారిన కులాల పట్ల చిన్నచూపు ఉన్న వాడు చంద్రబాబు..
జగనన్నలా ఎవ్వరూ ఆలోచించలేదు!
‘దేశంలో మనం ఎన్నో పార్టీలు చూశాం. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. సామాజికన్యాయం పాటిస్తామన్నవారే కానీ.. సామాజిక న్యాయం చేసిన పాపాన పోలేదు. అఖిలేష్‌యాదవ్, నితీష్‌కుమార్, కుమార్‌స్వామిలు.. ఇలా ఎందరో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారు. ఎస్సీలున్నారు. ఇప్పటికీ పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎవ్వరూ సామాజిక న్యాయం విషయంలో జగనన్నలా ఆలోచించలేదు. ఆ దిశలో అడుగులు వేయలేదు. కులం,మతం, ప్రాంతం చూడని జగనన్న హయాంలో, అణగారిన వర్గాలకు చెందిన ఎంతోమంది రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. అధికారపదవులు పొందారు.’