తెలంగాణ వీణ , హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలంటూ.. చిత్తారమ్మ గుడి దగ్గర చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కే పి వివేకానందకు బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సవాల్ విసిరారు. చెప్పిన మాట ప్రకారం ఉదయం 10 గంటలకు చిత్తారమ్మ ఆలయానికి కూన శ్రీశైలం గౌడ్ చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కోసం దాదాపు గంట పాటు చిత్తారమ్మ గుడివద్ద అయన వేచి చూసారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ చర్చకు రాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద తోకముడిచాడని ఆరోపించారు. 9 ఏళ్లలో బిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదు కాబట్టే చర్చకు రాలేదని, ఇప్పటికైనా ప్రజలు అలోచించి ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.