తెలంగాణవీణ, మల్కాజిగిరి ; మల్కాజిగిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజికవర్గం అభివృద్దే ధ్యేయంగా తాను పనిచేస్తానని, నీతికి, నిజాయితీకి కట్టుబడిప్రజలకు సేవ చేస్తానన్నారు. ప్రజలు స్వేచ్చగా మెలిగేటట్లు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడున్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల్లో తనను బారీ మోజార్టీ గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మర్రి మమతారెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజిగిరి ఇంచార్జి పదం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.