తెలంగాణ వీణ , జనరల్ : దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ స్టార్టయ్యింది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో Iphone 14తో పాటు ఏ ఫోన్లపై ఎక్కువ ఆఫర్లున్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి…
మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ప్రారంభం కానుంది. ఈ పండుగ సందర్భంగా ధమాకా సేల్ కూడా ఆరంభమైంది. ఈ ఫెస్టివల్ టైమ్‌లో కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ సేల్ వెబ్ సైట్లో భారీగా డిస్కౌంట్లు పొందొచ్చు. దీపావళి పండుగకు ముందే Flipkartలో నవంబర్ 2వ తేదీ గురువారం నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో అనేక బ్రాండ్లపై అద్భుతమైన ఆఫర్లు రానున్నాయి. ఇందులో IPhone, Samsung, Nothing Phone 2తో సహా అనేక మోడల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్..
ఈ సేల్‌లో మొదటి ఆఫర్ Iphone 14పై వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది లాంచ్ అయ్యింది. మీరు ఈ సెల్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని బ్యాంకు కార్డులను ఉపయోగించి రూ.49,999కే పొందొచ్చు. దీని అసలు ధర రూ.61,999 వరకు ఉంది. అయితే ఎలాంటి షరత్తులు లేకుండా ఈ ఫోన్ ధరను రూ.54,999గా బుక్ చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
Honor Magic 6 ఈ స్మార్ట్‌ఫోన్లో కంటి చూపుతో ఫోన్ యాప్స్ ఓపెన్ చేయొచ్చు..! ఇంకా ఎన్నో అదిరే ఫీచర్లు…
అదనంగా రూ.4 వేల వరకు బ్యాంకు డిస్కౌంట్ కూడా లభించనుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు మీ పాత ఐఫోన్‌ను మార్చుకోకపోయినా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు చాలా తక్కువ ధరలో పొందొచ్చు.
Samsung Galaxy F14 5G
సామ్ సంగ్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా Galaxy F14 5G మోడల్‌పై రూ.9,990 వరకు కొనుగోల చేయొచ్చు. Realme C51పైనా రూ.7,999 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు ఇదే సేల్‌లో ఇటీవల విడుదల చేసిన Motorola Edge 40 Neoపైనా భారీ తగ్గింపు లభించనుంది. రూ.25,999 వరకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
నథింగ్ ఫోన్‌పై డిస్కౌంట్లు..
మరోవైపు స్మార్ట్‌ఫోన్ Vivo T2 Proని రూ.21,999కి కొనొచ్చు. Poco X5 Pro కేవలం రూ.18,499కే లభించనుంది. అంతేకాదు సామ్ సంగ్ Galaxy F34 5G రూ.14,999కి అందుబాటలో ఉంది.
ఈ సేల్‌లో ఐఫోన్‌తో పాటు Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ ను రూ.31,499కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లన్నీ బహుళ హై ఎండ్ ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్లతో పాటు మరికొన్ని మోడల్స్ పై ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ సేల్‌లో చెక్ చేయండి.
జియో కొత్త టెక్నాలజీతో మారుమూల గ్రామాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్.. త్వరలో అందరికీ అందుబాటులో…
నవంబర్ 11వ తేదీ వరకే..
ఈ సేల్‌లో ఐఫోన్‌పై రూ.14,900 వరకు తగ్గింపు లభించనుండగా, నథింగ్ ఫోన్లపై రూ.15,500 వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్లన్నీ నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన ఫోన్లను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.