Saturday, December 28, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

యువతులే టార్గెట్‌!

Must read

తెలంగాణ వీణ , జాతీయం : యువతుల అపహరణలు.. గాజాకు తరలింపు.. నిరాయుధులైన మహిళల హత్యలు.. ఇజ్రాయెల్‌పై శనివారం ఉదయం ముప్పేట దాడి చేసిన పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ ఘాతుకాలివి..! అంతేకాదు.. అభంశుభం తెలియని చిన్నారులనూ హమాస్‌ మూకలు కిడ్నాప్‌ చేశాయి. వారి పట్ల అత్యంత అమానుషంగా.. పాశవికంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

చంపొద్దని వేడుకున్నా..

ఇజ్రాయెల్‌-గాజాస్ట్రిప్‌ సరిహద్దుల్లోని ‘పీస్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’కు హాజరైన యువతులు సింహభాగం బాధితులుగా ఉన్నారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వర్గాలు చెబుతున్నాయి. ఐడీఎఫ్‌ అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో కూడా ఆ వివరాలను.. కిడ్నాప్‌ అయిన యువతులు, మిలటరీ అధికారుల ఫొటోలను షేర్‌ చేశాయి. ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న అర్గమణి అనే పాతికేళ్ల యువతిని బైక్‌పై అపహరించుకుని తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అర్గమణితోపాటు.. ఆమె ప్రియుడు నాథన్‌ను కూడా బంధించి, గాజాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అర్గమణి ‘‘నన్ను చంపొద్దు.. ప్లీజ్‌.. దయ చేసి విడిచిపెట్టండి’’ అని ఉగ్రవాదులను వేడుకుంటున్నా.. వారు కనికరించలేదు. హమాస్‌ ఉగ్రవాదులు ఓ యువతిని నగ్నంగా ఊరేగిస్తున్న చిత్రాలను.. ఆమెను హతమార్చిన దృశ్యాలను టెలిగ్రామ్‌లో విడుదల చేశారు. ఆమెను ఇజ్రాయెల్‌ మిలటరీ అధికారిణిగా పేర్కొన్నారు. అయితే.. 30 ఏళ్ల వయసున్న ఆ యువతి పేరు శనిలౌక్‌ అని.. ఆమె జర్మన్‌ జాతీయురాలని ఐడీఎఫ్‌ నిర్ధారించింది. 35 మంది సైనికులతోపాటు.. 100 మందికి పైగా యువతులు, మహిళలను హమాస్‌ మూకలు కిడ్నాప్‌ చేశాయని ఐడీఎఫ్‌ చెబుతోంది.

హమాస్‌ దురాగతాలెన్నో

హమాస్‌ దురాగతాలు గాజాస్ట్రిప్‌ సరిహద్దు నగరాల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఇజ్రాయెలీ బాలుడిని అపహరించి, గాజాకు తీసుకెళ్లిన హమా్‌సలు.. అతణ్ని గాజాలోని కుర్రాళ్ల వద్ద వదిలేశారు. వారంతా ఆ బాలుడిని గేలి చేస్తూ.. కర్రలతో కొడుతున్న దృశ్యాలు గాజాలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. హమాస్‌ చెరలో తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తిని.. అతని కుమారుడు ‘‘మీ చేతులకు రక్తం ఎందుకుంది నాన్నా..’’ అని అమాయకంగా అడుగుతున్న ఓ వీడియో గుండెలను పిండేస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులు విదేశీయులను కూడా అపహరించి గాజాకు తీసుకెళ్లారు. వారిని చిత్రహింసలకు గురిచేస్తూ.. ఆ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇలా బందీలుగా ఉన్న వారిలో 11 మంది థాయ్‌లాండ్‌ జాతీయులు, 17 మంది నేపాలీలు ఉన్నారు. తొమ్మిది మంది నేపాలీలను హమా్‌సలు తీవ్రంగా గాయపరిచినట్లు కథనాలు వచ్చాయి.

రోడ్లపై చెల్లాచెదురుగా మృతదేహాలు

టెల్‌అవీవ్‌ వీధుల్లో.. హైవేపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హమాస్‌ ఉగ్రవాదులు శనివారం ఉదయం ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తూనే.. హైవేపై వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇజ్రాయెలీలను మట్టుబెట్టారు. నాలుగైదు కిలోమీటర్ల దూరం వరకు రోడ్ల పక్కన ఆగి ఉన్న కార్లు.. వాటిల్లో బుల్లెట్‌ గాయాలున్న మృతదేహాలు కనిపించాయంటూ ఐడీఎఫ్‌ ఆదివారం టెలిగ్రామ్‌లో పోస్టులు పెట్టింది.

హమా్‌సల టార్గెట్‌ ఇదే?

యువతులు, చిన్నారులు, విదేశీయులను అపహరించిన హమాస్‌లు భారీ వ్యూహంలో భాగంగానే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 5,200 మంది పాలస్తీనీయులు బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడిలో యువతులను కిడ్నాప్‌ చేసిన హమా్‌సలు.. వారి పట్ల పైశాచికంగా వ్యవహరించి ఆ వీడియోలను విడుదల చేసి.. తమ వాళ్లను విడుదల చేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తారని భావిస్తున్నారు.

ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం

ఇజ్రాయెలీల కిడ్నా్‌పపై ఈజిప్ట్‌ స్పందించింది. హమా్‌సలు వెంటనే వారిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు హమా్‌సలతో చర్చలు జరుపుతున్నట్లు ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సమేహ్‌ షౌక్రీ వెల్లడించారు. హమా్‌సలను ప్రభావితం చేయగలిగే దేశాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, బందీల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా.. హమా్‌సలకు మద్దతిస్తూ ఈజి్‌ప్టకు చెందిన ఓ పోలీసు అధికారి ఆదివారం దురాగతానికి పాల్పడ్డాడు. అక్కడి అలెగ్జాండ్రియాలో ఉన్న ఇజ్రాయెల్‌ పర్యాటకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు దుర్మరణంపాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని, నిందితుడిని అరెస్టు చేశామని ఈజిప్ట్‌ సర్కారు ప్రకటించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you