తెలంగాణ వీణ , హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టు వెనకాల బీజేపీ, వైసీపీ కుట్ర ఉందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. ‘‘ఇదంతా పచ్చి మోసం. బీజేపీ, వైసీపీ లేనిదే జరగుతుందా? 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని జైల్లో వేస్తారా? ఆయన ఏం పాపం చేశారు? ఆయన ఎవరనీ మోసం చేయలేదు. ఒకప్పుడు ఆయన దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి అవస్థ పెడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం కూడా బాలేదు. ఇదంతా బీజేపీ, వైసీపీ ఆడుతున్న నాటకం’’ అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.