Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బుల్డోజర్‌కు పని

Must read

తెలంగాణ వీణ , జాతీయం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్‌ అత్యాచార కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. .
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్‌ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు.
లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్‌ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్‌ భరత్‌ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you