తెలంగాణ వీణ , హైదరాబాద్ : తమ యువనేత కేటీఆర్‌ను సీఎం చేయడానికి ప్రధాని మోదీ ఆశార్వాదం ఎందుకని, రాష్ట్ర ప్రజలు, ఎమ్మెల్యేల ఆశీస్సులుంటే చాలని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. బుధవారం ఖమ్మం 23వడివిజన మేకలబండపార్కు ప్రారంభంలో మాట్లాడిన ఆయన నిజామాబాద్ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ తనను ఆశీస్సులు అడిగారని మోదీ చెప్పడం హాస్యాస్పందంగా ఉందని, ఎప్పుడో ఎన్నికల సమయంలో మోదీ, కేసీఆర్ మధ్య జరిగిన సంభాషణలను చిలువలుపలవలు చేసి చెప్పడంలో అర్థం లేదన్నారు. ఆయనది బోడి ఆశీర్వాదమని, మోదీ, అమితషా పాలన ఎలా ఉందో దేశ ప్రజలందరికీ తెలుసని, వారు రాచరికం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.