తెలంగాణ వీణ , హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలాగా పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం రేవంత్‌కు రాసిన బహిరంగలేఖను దాసోజు శ్రవణ్ విడుదల చేశారు. పాఠశాలలకు అద్భుతమై న భవనాలు, బాలలకు కమ్మటి అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నాణ్యమైన యూనిఫామ్ ఇస్తూ చకటి వాతావరణంలో విద్యనందిస్తున్న విద్యాదాత కేసీఆర్ అని కొనియాడారు.
అడ్డగోలు సంపాదనకు, దోపిడీకి అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన రేవంత్‌కు పేదింటి పిల్లల ఆకలి బాధలు తెలియవని పేర్కొన్నారు. పొద్దున్నే సూళ్లలో పసిపిల్లల కళ్లలో ఆనందం తొణికిసలాడుతుంటే మీ కళ్లల్లో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. 50 ఏండ్ల పాలనలో పిల్లలకు పొద్దున్నే పౌష్ఠికాహారం అందించాలన్న సోయి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయిందని విమర్శించారు. నేడు పాఠశాలల ప్లిలలకు అల్పాహారం అందిస్తున్న సీఎం కేసీఆర్‌పై దాడి చేయడం వారి మానసిక దౌర్బల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 23 లక్షల మంది పిల్లలకు కేసీఆర్ ఒక తాతలాగా కడుపునిండా కమ్మని బ్రేక్‌ఫాస్ట్ పెట్టి అండగా ఉంటున్నారని తెలిపారు.
ఈ తరహా పథకం ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. బ్రేక్ ఫాస్ట్‌కు బ్రేకులు వేద్దామనుకుంటున్న కుటిల నీచబుద్ధిని, మీ రాక్షస ప్రవృత్తిని పాతరేసి సకల జన సారథి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని శ్రవణ్ స్పష్టంచేశారు.