తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి? నీకేం హక్కు ఉంది? ఈ రోజు లోకేశ్ తెలుసుకోవాలి… ఇలాంటి అయ్యన్న, బండారును ఎంకరేజ్ చేసి, తనను తిట్టించి నా నోరు మూయించాలనుకున్నావని, కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏమయింది? అన్నారు. అదే అయ్యన్న నీ భార్య బ్రాహ్మణిని ఏమన్నాడో చూడు, బాలకృష్ణ కూతురు, లోకేశ్ పెళ్లాం, అదెవరు? దాని పేరు ఏంటి? అన్నాడన్నారు. కాబట్టి నాపై దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మీ కళ్లల్లోనూ పడిందన్నారు. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్లానికి వచ్చిందన్నారు. బ్రాహ్మణి కూడా ఈ విషయం తెలుసుకోవాలన్నారు.
జగన్‌ను సైకో అంటే ఎలా ఒప్పుకుంటాం?
తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు బ్రాహ్మణి చాలా చిన్నపాప అని, ఆమెకు తామే జడలు వేసి, ఆడించుకునే వారమన్నారు. ఆమె ఇంత వరకు రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మేమూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్‌ను సైకో అంటే తాము ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు.
టీడీపీ వాళ్లు నా గొంతు నొక్కాలనుకుంటే మీ వల్ల కాదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌కు మద్దతుగా, మహిళలకు మద్దతుగా తన గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. ఇకపై తప్పుడు మాటలు మాట్లాడితే.. కచ్చితంగా ఈసారి వదిలేది లేదని, ఎంతవరకైనా పోరాడతానని హెచ్చరించారు. బండారును అరెస్ట్ చేసినంత మాత్రాన వదిలేది లేదని, ఆయనపై పరువునష్టం దావా వేస్తానన్నారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. మహిళల గురించి దిగజారుడుగా మాట్లాడాలంటే భయపడేవిధంగా ముందుకు
సాగుతానన్నారు.