తెలంగాణ వీణ , హైదరాబాద్ : మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణకు వస్తున్న మోదీ.. ఆ మూడు ప్రధాన హామీలను ఏమి చేశారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పాతరేసి ఇంకెంతకాలం ఈ అబద్ధాల జాతరంటూ మంగళవారం ట్వీట్(ఎక్స్) చేశారు. ‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉకు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా దకేదెప్పుడు? మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి వస్తున్నారు కదా? ఆ మూడు ప్రధాన హక్కులకు దిక్కే ది?’ అని నిలదీశారు. ‘పదేండ్ల నుంచి పాతరేసి ఇకెంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని.. తెలంగాణ గుండెల్లో గునపాలా? కోచ్ ఫ్యాక్టరీ, ఉకు కర్మాగారం ఊపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయహోదా హామీని తుంగలో తొకారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు’ అంటూ మండిపడ్డారు.