Thursday, December 26, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 హమాస్‌ను ఈ భూమ్మీద పూర్తిగా తుడిచిపెట్టేస్తాం

Must read

తెలంగాణ వీణ : ఊహించని దాడులతో ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తానీ మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్‌లో ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని, ఈ భూమ్మీది నుంచి హమాస్‌ను పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. హమాస్‌ను పూర్తిగా అంతమొందిస్తామని నెతన్యాహు స్పష్టంగా చెప్పడం ఇదే తొలిసారి. 

‘‘ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అయిన హమాస్‌ను పూర్తిగా అణచివేస్తాం. ఈ ప్రపంచం నుంచి వారిని పూర్తిగా నిర్మూలిస్తాం’’ అని తాజాగా ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్‌తో కలిసి ప్రకటించారు. రక్షణ మంత్రి యావ్ గాలంట్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భూమిపై హమాస్ అనేదే లేకుండా తుడిచిపెట్టేస్తామని పేర్కొన్నారు.  

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you