తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ