తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి పెళ్లి జరగనుంది. ఇటలీలోని టస్కనీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అక్టోబర్ 30న మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. పెళ్లి కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వరుణ్, లావణ్యలు ఇటలీకి బయల్దేరారు. వీరితో పాటు వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లాడు. మరోవైపు నవంబర్ 5న మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.