తెలంగాణ వీణ , హైదరాబాద్ : పాపం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు ఆయన గురించి మాట్లాడుకోవద్దని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మెదక్‌లో గురువారం నాడు పర్యటించారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, చంద్రబాబులపై హరీశ్ వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్డీఏ లో సీఎం కేసీఆర్ చేరుతానని అన్నారని.. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. బీజేపీవీ అన్నీ జూటా మాటలే. రెండేళ్ల క్రితం కలిస్తే అప్పుడే ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించాడు. ఎన్డీఏ తో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు లేనే లేదు. అసలు కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ ప్రభుత్వమే. హైదరాబాద్ నుంచి మెదక్‌కు గుండాల గ్యాంగు, పైసల కట్టలతో బయల్దేరింది. గొర్రెల మంద మీద తోడేళ్ల లాగా దాడి చేస్తారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ఆనేతలను అసలు నమ్మొద్దు. నోట్ల కట్టలు గెలవాలా, మెదక్ ఆత్మగౌరవం గెలవలా..ప్రజలు ఆలోచించాలి.మూడు పద్ధతుల్లో ఎరుకల కులాలకు సహాయం చేస్తాం.