తెలంగాణ వీణ ,సినిమా : KH234 లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు మణిరత్నం డైరెక్షన్‌లో KH234 సినిమాకు కూడా ఒకే చెప్పేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కమల్‌హాసన్ అండ్ మణిరత్నం టీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ జాయిన్ అయ్యాడు.శ్రీకర్ ప్రసాద్ వివిధ సినీ పరిశ్రమల నుంచి 9 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ విజేతగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎడిటర్‌గా పనిచేసిన శ్రీకర్ ప్రసాద్ జాయిన్ అవడంతో KH234పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. శ్రీకర్ ప్రసాద్, కమల్ హాసన్, మణిరత్నం కలిసి దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. నవంబర్ 7న కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా KH234 నుంచి భారీ అప్‌డేట్‌ను అందించబోతుంది మణిరత్నం టీం.ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. KH234 సినిమా కోసం కమల్ హాసన్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2024లో షురూ కానుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. KH234 చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మి్స్తున్నాయి.కమల్ హాసన్ టీం దీంతోపాటు హెచ్ వినోథ్ డైరెక్షన్‌లో KH233 షురూ అంటూ ఓ వీడియో రూపంలో అప్‌డేట్ కూడా అందించగా.. నెట్టింట వైరల్ అవుతోంది. KH233 చిత్రాన్ని కమల్ హాసన్ సమర్పణలో హోంబ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సామాజిక కథాంశాన్ని జోడిస్తూ.. KH233 ఉండబోతున్నట్టు టాక్. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు కమల్ హాసన్ .