తెలంగాణ వీణ, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజీకవర్గం లో మైనంపల్లి గుందాయిజం వలన చాలామంది ఇబ్బందులు పడ్డారని, అతను చేసిన కబ్జాల వల్ల ఎంతోమంది తమ భూములు కోల్పోయి నిరాశ్రయులు అయినట్లు బిజెపి జాతీయ కోశాధికారి టీం సాయి తెలిపారు. నేరెడ్మెట్ లో ఏర్పాటు చేసిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హన్మంతరావు అతని అనుచరుల వల్ల ఇబ్బందులు పడ్డ వారి కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మైనంపల్లి అతని అనుచరుల అరాచకాలకు గురైన భాదితులు ఎవరైనా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడమే కాకుండా #మైనంపల్లి క్రిమినల్ ఫైల్స్, #మైనంపల్లి గుండాయిజం అని మెసేజ్ పెట్టాలని టీమ్ సాయి తెలిపారు. వారి తరుపున తాను పోరాడతానని అతి త్వరలో మైనంపల్లి ని చర్లపల్లి జైలు కు పోయే విధంగా చేస్తానని ప్రజలకు అతని నుండి విముక్తి కలగ చేస్తానని మీడియాకు తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతో మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని వాటిపై తాను పోరాటం చేస్తానని తెలియజేశారు.మల్కాజిగిరి భాజాపా నేత పి.ఎం సాయి ఏర్పాటు చేసిన ప్రెసుమీట్ లో మైనంపల్లి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దుఅని, బెదిరింపులకు పాల్పడితే 9603596015 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఏ సమయంలోనైనా మెసేజ్ లు,కాల్స్ రూపంలో సంప్రదించండి అని తెలిపారు..