Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నేడు అందరి దృష్టి కోర్టుల వైపే

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. జస్టిస్‌ అనిరుద్దాబోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఆరవ నంబర్‌ కోర్టులో ఐటమ్‌ 59గా ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చారు. గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన విషయం విధితమే.

ఇదిలా ఉండగా, ఇదే కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు రెండ్రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కానీ చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేయడంతో పాటు కస్టడీలో విచారణకు ఏమాత్రం సహకరించలేదని సీఐడీ న్యాయస్థానానికి తెలిపింది. దాంతో పాటు ఈ కేసు దర్యాప్తులో తాజాగా కనుగొన్న కీలక ఆధారాలపై ఆయన్ను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి నివేదించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you