తెలంగాణ వీణ , హైదరాబాద్ : హోంవర్క్ చేయలేదని టీచర్ పలుకతో తలపై కొట్టడంతో యూకేజీ చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో జరిగింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్ వివేక్‌నగర్‌లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ (5) యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లిన హేమంత్‌ను హోంవర్క్ చేయలేదని టీచర్ తలపై పలకతో కొట్టింది .దీంతో ఒక్కసారిగా అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని వెంటనే దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. టీచర్ కొట్టడంతోనే చనిపోయాడని బాలుడు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వనపర్తికి తరలించారు.