తెలంగాణ వీణ , జాతీయం : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు 4,793 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్‌పై పోవాల్సిందే. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు.