తెలంగాణ వీణ , సిద్దిపేట : సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. నేను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే. బిఆర్ఎస్ నేతల ద్వారా బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి కుట్ర చేస్తున్నారు. నేను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. బిఆర్ఎస్ నేతల ద్వారా మాపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, ఏసీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ వాహనంలో వచ్చి డబ్బులను ఓఎస్డీ పంచుతున్నారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్‌లో కల్యాణలక్ష్మిచెక్ లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అధికారులపై ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఉపఎన్నికల్లో నన్ను ఎంత టార్చర్ చేశారో అందరికీ తెలుసు అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.