Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అహింసా మార్గంలో వెళ్లడం ఇప్పుడు సాధ్యం కాదు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : సినిమా హాల్స్‌లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి. పది లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపానకు గౌరవిస్తూ నిలబడ్డారు. అవినీతి, దౌర్జన్యంతో నేడు భారతదేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు. ఈ రాష్ట్ర

Pawan Kalyan: అహింసా మార్గంలో వెళ్లడం ఇప్పుడు సాధ్యం కాదు

కృష్ణాజిల్లా: గాంధీజీ అహింసా, త్యాగాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మచిలీపట్నంలో ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బందర్ జాతీయ ఉద్యమానికి పునీతమైన నేల. ఆంధ్రా నేషనల్ కాలేజ్ ప్రత్యేకమైన పరిస్థితిలో పెట్టారు. మనది అని చెప్పేందుకు పెట్టిన కాలేజీ ఇది. దివిసీమ, బందరు ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు. నేషనల్ కాలేజ్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలోనే మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నోరి దత్తాత్రేయ వంటి ఎందరో ఈ ఆంధ్రా కళాశాలలో చదివారు. నేడు ఈ కళాశాలలో సరైన వసతులు లేవని చెబుతున్నారు. గాంధీ వెళ్లిన ఆ కళాశాలను త్వరలో సందర్శిస్తా. ఈశ్వర్ అల్లాతేరా నామ్ అనేది గాంధీ గారు పెట్టించారు. భక్తి పాటలను ఎవరూ మార్చలేరు. కానీ సనాతన ధర్మం అందరినీ కలిపి తీసుకెళుతుంది. మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి రుణపడి ఉండాలి.’’ అని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you