తెలంగాణ వీణ , జాతీయం : దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్ లేదని, రోడ్‌మ్యాప్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. రాజస్తాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న సంగతి గహ్లోత్‌కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్‌లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్‌వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్‌గఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు.