తెలంగాణ వీణ , సినిమా : ఆల్ఫోన్స్ పుతిరన్ ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ప్రేమమ్ డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తు పడతారు. నివిన్ పాలీ, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ప్రేమమ్. ఆల్ఫోన్స్ పుతిరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2015లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన మలర్ పాత్ర ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఇంపాక్ట్ చేసింది. ఇక.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను చూడడం మొదలుపెట్టారంటే నమ్మక తప్పదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుతిరన్ సంచలన ప్రకటన చేశాడు. తాను డైరెక్షన్ నుంచి సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ..నేను నా సినిమా, థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నాను. నాకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని నిన్న తెలిసింది. ఈ విషయంపై ఎవరిని బాధ పెట్టాలి అనుకోట్లేదు. నా సినిమా కెరీర్‌ను ముగించినషార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, సాంగ్స్ OTTలలో మూవీస్ చేస్తూ ఉంటాను. నాకు సినిమాల నుంచి దూరంగా పోవాలని లేదు. కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇక నేను నిలబెట్టుకోలేని వాగ్దానాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా లేదా అనూహ్యంగా ఉన్నప్పుడు, లైఫ్ అనేది ఇలా ఇంటర్వెల్ పంచ్ వంటి ట్విస్ట్‌ను తెస్తుంది అంటూ పుతిరన్ సోషల్ మీడియాలో రాసుకోచు ఇక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధికి గురైన వ్యక్తులు ఇతరులతో మాట్లాడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి ఏ వయసులో అయిన బయట పడవచ్చు. ముఖ్యంగా ఇది పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) బారిన పడే ప్రమాదం అధికంగా ఉంది.ఇక 2013లో నివిన్ పాలీతో చేసిన ‘నేరం’ సినిమాతో దర్శకుడిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు ఆల్ఫోన్స్ పుతిరన్. అ తర్వాత 2015లో‘ప్రేమమ్’ సినిమాను తీశాడు. ఇక ‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘గోల్డ్’ సినిమాతో మళ్ళీ మెగాఫోన్ పట్టాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.