తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 54 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున ఆయన పరిహారాన్ని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.