తెలంగాణ వీణ,సినిమా : మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‍లు,ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగారు..అయితే, చిరంజీవిని తొలి నాళ్లలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’.ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు.. 1983లో విడుదల అయిన ఖైదీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఖైదీ సినిమా రిలీజై 40 ఏళ్లు అయిన సందర్భంగా నేడు (అక్టోబర్ 28) ఆ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఖైదీ సినిమా తన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరు నేను ఎప్పటికీ మరువలేనిదంటూ పేర్కొన్నారు. “ఖైదీ సినిమా నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీని చేసింది. నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.. ఈ సినిమాతో నా సినీ జీవితం మారిపోయింది… ఖైదీ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటూ చిరంజీవి తన ట్వీట్‍లో పేర్కొన్నారు.అలాగే, ఖైదీ సినిమా యూనిట్‍కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.ఖైదీ సినిమా దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి, నిర్మాత సంస్థ సంయుక్త మూవీస్ టీమ్, రచయితలు పరుచూరి సోదరులను అలాగే తనతో కలిసి నటించిన సుమలత, మాధవితో పాటు మొత్తం చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నట్టు చిరంజీవి ట్వీట్ చేశారు. గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. ఖైదీ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను కూడా షేర్ చేసుకున్నారు.అయితే చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా 1983 నవంబర్ 28వ తేదీన రిలీజ్ అయింది. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చిరంజీవి చేసిన ఫైట్లు, డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఖైదీ హిట్‍తో స్టార్ హీరోగా ఎదిగారు . అప్పట్లోనే ఖైదీ సినిమా రూ.8కోట్ల కలెక్షన్లను సాధించినట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు కే చక్రవర్తి సంగీతం అందించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి తన 156వ సినిమా సోషియో ఫ్యాంటసీ మూవీ గా తెరకెక్కుతుంది.. బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి విశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్‍గా జరిగాయి