తెలంగాణ వీణ , జాతీయం : మానవాళికి ఎక్కడ, ఏ రూపంలోని ఉగ్రవాదమైనా వ్యతిరేకమేనని, సంఘర్షణలు ఏ పక్షానికీ ఉపయోగకరం కాదని ప్రధాని మోదీ అన్నారు. ఇది శాంతి, సోదరభావాలతో మెలగాల్సిన సమయమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘చొరబాటు ఉగ్రవాద సమస్యను దశాబ్దాలుగా మేం ఎదుర్కొంటున్నాం. ఉగ్రవాదులు మా దేశంలో వేలాదిమంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు’’ అని మోదీ వివరించారు. అయినా.. ఉగ్రవాద నిర్వచనం విషయంలో ఇప్పటికీ విభేదాలు కొనసాగడం శోచనీయమన్నారు.
మోదీ చేతికి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా రాఖీ కట్టారు. రివేరాకు ఆయన ఆశీస్సులు అందించారు. ఢిల్లీలో శుక్రవారం జీ-20 స్పీకర్ల సదస్సు సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాగా, కెనడా పార్లమెంటు స్పీకరు రేమండే గాన్యే ఈ సదస్సుకు హాజరు రాలేదు.