తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు. నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు.