సమాజంలో వార్తపత్రికల పాత్ర కీలకమైంది – బీఎల్ఆర్
తెలంగాణ వీణ , హైదరాబాద్ : సమాజంలో వార్తపత్రికలు కీలక పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉప్పల్ అసెంబ్లీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ వీణ దినపత్రిక వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు. ఎప్పటికప్పడు జరుగుతున్న వార్తలను పాఠకులకు తెలియజేసినప్పుడే ఆధరణ లభిస్తోందన్నారు. జీఎస్9టీవీ ఛానల్ , తెలంగాణవీణ దినపత్రిక లు ప్రజాధరణ పొంది రాణించాలని బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రసార సాధనాలు ప్రజలను చైతన్య పర్చేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ మాజీ ఛైర్మన్ తాడూరీ శ్రీనివాస్, నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, బీఆర్ఎస్ నాయకులు కాప్రా డివిజన్ అధికార ప్రతినిధి మరాఠి రవీందర్ రావు , మేకల ముత్యంరెడ్డి, తుంగతిరుపతి, జీఎస్9టీవీ ఇన్ పుట్ ఎడిటర్ శ్రీధర్, తెలంగాణ వీణ సిబ్బంది వంశీ, గణేష్ లతో పాటు పలువురు నాయకులు పాల్పొన్నారు.