హజరైన పలువురు ప్రముఖులు…
అనతీకాలంలోనే పత్రిక వెలుగొందాలని ఆకాంక్ష…
సమాజంలో మీడియా పాత్ర కీలకం
చిన్న పత్రికగా ప్రారంభమైన `తెలంగాణ వీణ’ త్వరలోనే దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదన్నారు.
గురువారం తెలంగాణ వీణ దినపత్రిక ప్రారంభోత్స కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈసీఐఎల్ , మైత్రి అపార్టుమెంట్ లో ని పత్రిక కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులు, వివిధ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ వీణ ప్రారంభ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం దినపత్రిక యజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేకంగా అతిథులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ, పత్రిక విలువలను కాపాడుతూనే ప్రజల పక్షాన వారిధిగా నిలబడాలని సూచించారు. సమాజంలో జరగుతున్న అన్యాయాలు, మోసాలపై నిర్భయంగా పోరాటం చేయాలన్నారు. ఇందులో జర్నలిస్టులు ఎప్పుడు…ఎలాంటి సమయంలోనూ వెనకంజు వేయవద్దన్నారు. ఉన్నతమైన విలువలతో పత్రికను ముందుకు తీసుకెళ్లినప్పుడే ప్రజల గుండెల్లో పది కాలాల పాటు పదిలంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వెంకట రమణ, కుషాయిగూడా ఏసీపీ రవీందర్, చర్లపల్లి స్టేషన్ ఆఫీసర్ మల్లికార్జున్, వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మీ, ప్రముఖ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, మేస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్, తెలుగు నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, స్థానిక బీఆర్ఎస్ నేతలు కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.