Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వరల్డ్ కప్ లో టీమిండియా సిక్సర్…

Must read

తెలంగాణ వీణ , క్రీడలు : వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. 

లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే  లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి, 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 

టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటడం విశేషం. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు 1 వికెట్ లభించాయి. ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్ స్టన్ చేసి 27 పరుగులే అత్యధికం. టాపార్డర్ వైఫల్యంతో ఏ దశలోనూ ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you