తెలంగాణ వీణ, హైదరాబాద్ : సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు ఏసిపి గోషామహల్ మరియు ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి పురాణాపూల్ బ్రిడ్జి వద్ద నాకాబందీ లో భాగంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద నుండి 18 లక్షల రూపాయల నగదు లభ్యమయ్యాయి…పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు రోహిత్ అనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను హమీదుల్లా ఖాన్ అనే వ్యక్తి కోసం కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది… మరో లెక్కలేని 17 లక్షల 50 వేల రూపాయలు ముషీరాబాద్ లోని స్క్రాప్ దుకాణంలో ఉన్నట్లు సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు… దీంతో మొత్తం 35 లక్షల 50 వేల రూపాయల లెక్కలేని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..