తెలంగాణ వీణ , హైదరాబాద్ :తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేత నారా లోకేష్ సత్యగ్రహా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ…‘‘జగన్ జైలు జీవితం వేరు, దేశ స్వాతంత్రం కోసం గాంధీ జైలు జీవితం వేరు. మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ గాంధేయ మార్గంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమన నీతికి అతీతంగా నేను నిరసన తెలుపుతున్నాను. లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపాను. ఐదుగంటల తర్వాత నారా భువనేశ్వరి కూడా మాట్లాడుతారు.‘‘మొతా మోగిద్ధాం’’ కార్యక్రమంలో సౌండ్ చేశారని పోలీసులు కొందరి పై కేసులు పెట్టారని తెలిసింది. ప్రజా న్యాయస్థానంలో ప్రజలు మీ బొమ్మలను చూసి అస్యహించుకుంటున్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనీగడ్డలో నాలుగో విడత వారాహి యాత్రపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై వారి కులం వారితో ఎన్ని మాటలు అనిపించిన ఫలితం లేదు.