తెలంగాణ వీణ : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలో భాగంగా ఓసి ఫోర్ కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు , సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని వేతన పెంపు, లాభాలలో వాటా లాంటి ప్రధాన సమస్యలు పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా అధ్యక్షులు మంగీలాల్ డిమాండ్ చేశారు గురువారం నాడు ఏరియాలోని ఓసి 4 లో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాన్ని కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సింగరేణి ఉత్పత్తి ఉత్పాతకలో పర్మిట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సేవలు కూడా ఉన్నాయని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులను అంటరాని వారివని చూస్తున్నారని,ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను కాంట్రాక్ట్ కార్మికులు నిలదీయాలని ఆయనే కోరారు ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు సింగరేణి కాంటాక్ట్ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తామని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టివల్ లో చేర్చాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏ శంకర్, ఏ మల్లికార్జున్, ఎం కృష్ణ, టి వెంకటేశ్వర్లు, ఎం శ్రీను డి కమలాకర్, వెంకటరత్నం, ఎస్ సుబ్బరాజు, బి అనిల్ తదితరులు పాల్గొన్నారు.