తెలంగాణ వీణ , సినిమా : శ్రీదేవి నా అభిమాన నటి. ఆమె ఎలాంటి పాత్ర అయినా పోషించగలరు. అంతటి పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ’’ అన్నారు నేహా శెట్టి. ‘డీజే టిల్లు’లో రాధికగా ఆకట్టుకొన్న నేహా.. ‘బెదురులంక’లో మెరిసింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘రూల్స్ రంజన్’లో నటించారు. ఈవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా ఏమన్నారంటే…
నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ‘డీజే టిల్లు’. అందులో రాధికగా నటించాను. ఎక్కడికి వెళ్లినా అదే పేరుతో పిలుస్తున్నారు. ఇలాంటి గౌరవం ఓ నటిగా నాకు దక్కడం నా అదృష్టం. ‘రూల్స్ రంజన్’లో నా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో సనా పాత్రలో నటించాను. రాధికకూ, సనాకు ఏమాత్రం పోలికలు ఉండవు’’.‘నేహా తిరుపతి అమ్మాయి. తనకు స్వార్థం ఉండదు. ప్రపంచాన్ని అన్వేషించాలనుకొంటుంది. పాత్ర పరంగా కొంత గ్లామర్ కూడా ఉంటుంది. ‘సమ్మోహనుడా’ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట కోసం చాలా కష్టపడ్డాను. అంతకు మించిన ప్రతిఫలం లభించింది. సంగీత దర్శకుడు అమ్రిష్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు