తెలంగాణ వీణ, సినిమా : పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా ఉన్న నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా తాజాగా సంచలన ప్రకటన చేశాడు. శిల్పా శెట్టి, తాను విడిపోయామని ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రాజ్‌కుంద్రా నటించిన ‘యూటీ 69’ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.పోర్నోగ్రఫీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టు తరువాత రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. నాటి నుంచి అతడు మాస్కు పెట్టుకునే మీడియా ముందుకు రావడం మొదలెట్టాడు. అయితే, త్వరలో తన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో బుధవారమే రాజ్ కుంద్రా ఈ ధోరణికి స్వస్తి పలికాడు. మాస్కు లేకుండా తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, రాజ్ కుంద్రా జీవితంలోని కాంట్రవర్సీలే నేపథ్యంగా రూపొందిన ‘యూటీ 69’ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.