తెలంగాణ వీణ , హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మొన్న తిరుపతి రెడ్డి చేరిక నేడు శశిధర్ రెడ్డి చేరికతో మెదక్‌లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. కొందరు డబ్బు సంచులతో వస్తున్నారన్నారు. మెదక్ ఆత్మ గౌరవాన్ని డబ్బులతో కొనలేరన్నారు. ఎన్నికల పండుగకు రకరకాల వ్యక్తులు వస్తున్నారని హరీష్ రావు అన్నారు.
వ్యవసాయం దండగ అన్న దానిని సీఎం కేసీఆర్ పండగ చేశారని అన్నారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఉత్తి కరెంట్ చేశారని హరీష్ రావు అన్నారు. నేడు పంట పండుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మూడు పంటల వైపు ఉంటారా..మూడు గంటల కరెంట్ వైపు ఉంటారా రైతులు ఆలోచించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.