Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేసీఆర్ పై పోటీకి షబ్బీర్ వెనకడుగు..?

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సుముఖంగా లేరని తెలుస్తోంది. పోటీ చేసేందుకు ఆయన వెనుకడుగు వేస్తుండడంతో మరో అభ్యర్ధి అన్వేషణలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో సీఎం కేసీఆర్ పై కామారెడ్డి నుండి పోటీచేసేదెవరో ప్రకటించకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయింది. ఆయన కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించిన మదన్ మోహన్ రావు కామారెడ్డి నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మదన్ మోహన్ రావు నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం అనిశ్చత స్థితి నెలకొంది.
రాజకీయాల్లో హత్యలు వుండవు… అన్నీ ఆత్మహత్యలే అంటుంటారు. సీఎం కేసీఆర్ పోటీచేస్తే తన పరిస్థితి ఇలాగే తయారవుతుందని షబ్బీర్ అలీ బావిస్తున్నారట. అందువల్లే నియోజకవర్గంపై కాంగ్రెస్ పట్టు ఉన్నా… గతంలో ఇక్కడినుండే ప్రాతినిధ్యం వహించినా… కామారెడ్డి నుండి పోటీకి షబ్బీర్ అలీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కీలకమైన నాయకుల పేర్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లోనే వున్నా షబ్బీర్ అలీ పేరు మాత్రం కనిపించలేదు. సీఎం కేసీఆర్ పోటీకి దిగి గెలిస్తే మంచిదే… కానీ ఓడిపోతే తన పొలిటికల్ కెరీర్ ఇంతటితో ఆగిపోయే ప్రమాదముందని షబ్బీర్ అలీ భయపడుతున్నారట. ఇదే విషయాన్ని టిపిసిసితో పాటు కేంద్ర పెద్దల వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. వారినుండి రాజకీయ భవిష్యత్ పై భరోసా లభిస్తే కామారెడ్డి నుండి పోటీ చేయాలని… లేదంటే మరో నియోజకవర్గానికి మారాలని షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కామారెడ్డి నుండి కాకుంటే ఎల్లారెడ్డి నుండి పోటీ చేయాలని షబ్బీర్ భావిస్తున్నారట. కానీ ఇప్పటికే ఎల్లారెడ్డి నుండి పోటీకి మదన్ మోహన్ రావు సిద్దమైన నేపథ్యంలో ఆయనను బుజ్జగించే పనిలో షబ్బీర్ అలీ పడ్డారట. అన్నీ కుదిరితే ఈసారి ఎల్లారెడ్డి బరిలో దిగేందుకే షబ్బీర్ ఆసక్తి చూపిస్తున్నారట… ఏదీ కుదరకపోతేనే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్దపడనున్నారట. షబ్బీర్ అలీ ఏం చేస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.షబ్బీర్ అలీ కేసీఆర్ పై పోటీ చేయాలా వద్దా అన్నది ఇంకా నిర్ణయించుకోకపోవడం వల్లే కాంగ్రెస్ అభ్యర్థులు తొలి జాబితాలో ఆయన పేరు ప్రకటించనట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లందరి పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే వుంటే షబ్బీర్ అలీ పేరు లేకపోవడంతోనే కేసీఆర్ పై పోటీకి ఆయన వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఇదే నిజమైన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎవరిని పోటీకి దింపుతున్నది ఆసక్తికరంగా మారనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you