తెలంగాణ వీణ , హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఆమె సెలబ్రిటీ. సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవడంలో ఆమె ట్రెండ్‌సెట్టర్. వెయ్యి రూపాయల సేవ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకోగలిగిన నైపుణ్యం సీతక్క సొంతం. అయితే, సోషల్ మీడియాను వదిలి క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే ములుగుకు సీతక్కచేసింది ఏమీకనిపించదు. ఎమ్మెల్యేగా సీతక్క విఫలమైనా కేసీఆర్ ప్రభుత్వం
మాత్రం ములుగు ప్రజల్లో వెలుగులు నింపింది. ములుగును జిల్లాగా మార్చింది. గిరిపుత్రులకు మౌలిక వసతులు కల్పించింది. పోడు భూములకు పట్టాలు ఇచ్చి అండగా నిలిచింది. ఇప్పుడు ములుగు మారుమూల జిల్లా కాదు. మాడల్ జిల్లా.
ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ గత పాలకులు ములుగును చిన్నచూపు చూశారు. మేడారం జాతరప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఈ ప్రాంతం వాళ్లకు గుర్తుకొచ్చేది కాదు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క రెండుసార్లు గెలిచినా ఆమె నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదన్న విమర్శలు ఉన్నాయి. దశాబ్దాల సమస్యలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకతో పరిష్కారం లభిస్తున్నది. విద్య, వైద్యం, రవాణా అన్ని రంగాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.