మహాత్మాగాందీని అవమానించే రీతిలో చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పవిత్ర ఉద్దేశ్యంతో దీక్షలు చేస్తే బాగుంటుంది కానీ, అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబు గురించి టీడీపీ నేతలు దీక్షలు చేయటం సిగ్గుచేటన్నారు.దోపిడీ చేసి జైలుకెళ్లి బాబు దీక్షలు చేయటమేమిటని ఆయన ప్రశ్నించారు. మహాత్మాగాందీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట సాధనలో ఆ మహనీయుల త్యాగాలను, పోరాటాలను సజ్జల గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు సిగ్గులేకుండా గాంధీ జయంతి రోజున నిరాహారదీక్ష చేయడమేమిటి? మహాత్మాగాందీని అవమానించే రీతిలో ఆయన దీక్షలున్నాయి. బాబు ఆధారసహితంగా దొరికిపోవడంవల్లే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలులో దీక్షలు చేయడం హాస్యాస్పదం. ప్రజల కోసం పోరాటంచేసి జైలుకెళ్తే వేరు. ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా దోచుకుని సత్యాగ్రహదీక్షలు ఎలా చేస్తారు. గాంధీ జయంతి రోజున ఉదాత్తమైన లక్ష్యాల కోసం దీక్షలు చెయ్యొచ్చు. కానీ ఒక అవినీతిపరుడు అడ్డంగా బుౖకై బరితెగింపుతో దీక్షలేంటి?