Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

థియేటర్లలో దిగిపోతున్న సంపూ సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’

Must read

తెలంగాణ వీణ, సినిమా : సంపూర్ణేశ్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆరంభంలో కథానాయకుడిగానే చేస్తూ వచ్చిన ఆయన, ఈ మధ్య అడపా దడపా కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు తన మార్కు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. అలా ఆయన నుంచి వస్తున్న సినిమానే ‘మార్టీన్ లూథర్ కింగ్’. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టీమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. అమాయకుడైన హీరో రాజకీయ పార్టీల మధ్య ఎలా చిక్కుకున్నాడు? ఆ తరువాత పరిస్థితులను ధైర్యంగా ఎదిరించి ఎలా నిలబడ్డాడు? అనేదే కథ. శశికాంత్ – చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకి, పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. సంపూ జోడీగా శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకి, శరణ్ సాయి సంగీతాన్ని అందించాడు. నరేశ్ .. గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘కొబ్బరిమట్ట’ తరువాత హిట్ లేని సంపూకి, ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you