తెలంగాణ వీణ , సినిమా :బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్‌లో వస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటివరకున్న అప్‌డేట్. అయితే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వస్తున్నారు. కాగా టైగర్ 3 విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.. వెయిట్ చేయండి.. అని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. పులి గాయపడింది.. అని ట్వీట్‌తో కొన్ని రోజుల క్రితం టైగర్ 3 అప్‌డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు సల్లూభాయ్. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసేందుకు యశ్ రాజ్ ఫిలిం ప్లాన్ చేస్తోంది.