తెలంగాణ వీణ, సినిమా : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన ఎంటర్‌టైనర్ ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయడానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే..పలు వాయిదాల తర్వాత ఈ చిత్రం తేదీని ప్రకటించారు నిర్మాతలు. డిసెంబర్ 22న పాన ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విషయమై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా వాయిదా పడినా కనీసం ట్రైలర్ అయినా సమయానికి రిలీజ్ చేయాలని ఫాన్స్ కోరుతున్నారు. దీంతో ‘సలార్’కు రెండు ట్రైలర్లను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ట్రైలర్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. అలాగే నవంబర్ చివర్లో మరో ట్రెలర్‌ను తీసుకురావడానికి ప్లాన చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు ఎక్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.ఇప్పటికే సలార్’ టీజర్ ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే… హీరోని ఎలివేట్ చేస్తూ టీనూ ఆనంద్ చెప్పిన సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలక పాత్రధారులు.