తెలంగాణ వీణ, క్రీడలు : వరల్డ్‌కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.ఇది బ్యాట్ పవర్ కాదు బాస్.. బాడీ పవర్.. అంపైర్‌కు రోహిత్ శర్మ అదిరిపోయే రిప్లేవరల్డ్‌కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ హిట్టింగ్‌కు ముగ్దుడైన అంపైర్ ఎరాస్మస్.. రోహిత్‌ను ఓ వింత ప్రశ్న అడిగాడు.‘బ్యాట్‌లో ఏం పెట్టుకొచ్చావు.. అంత బలంగా బాదుతున్నావు’ అని అంపైర్ అనగా.. దానికి రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ఇది బ్యాట్ పవర్ కాదు.. బాడీ పవర్’ అంటూ తన కండలు చూపించాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఈ అంశాన్ని గుర్తు చేస్తూ.. నవ్వులు పూయించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా హ్యాట్రిక్ విజయాలతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
— Rohit Sharma Trends™ (@TrendsRohit) October 15, 2023Tweet