తెలంగాణ వీణ , జాతీయం : ఈ నెల 14న ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది. ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు.
దీని తర్వాత 2046 వరకు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈసారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించటం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది.