తెలంగాణ వీణ , జాతీయం : క్రికెటర్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారాలకు రతన్ టాటా ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి కానీ ఎటువంటి ప్లేయర్‌కు కానీ రివార్డు అంశాన్ని ప్రకటించలేదన్నారు. వ్యాపారవేత్త రతన్ టాటా ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రికెట్ గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని, దాంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, వీడియోలను నమ్మవద్దు అని, ఏదైనా ఉంటే తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తానన్నారు