తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 55 మంది పేరు, రెండో జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక, మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతున్నట్టు తెలుస్తోంది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. మరోవైపు.. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో టికెట్ దక్కని వారు ఆశావహులు హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు పార్టీని సైతం వీడటం గమనార్హం.