తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రముఖ దర్శకుడు, రచయిత దేవ కట్టా చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో నేరం రుజువయ్యేవరకు దోషి కాదని, కానీ నియంతృత్వంలో మాత్రం నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషి అని దేవ కట్టా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ గత నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆయన రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉంటున్నారు.