తెలంగాణ వీణ, సినిమా : మెగా హీరో వరుణ్ తేజ్ వివాహానికి తాను వెళితే అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లలేదని నటి రేణుదేశాయ్ పేర్కొన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. నిహారిక వివాహానికి కూడా తాను వెళ్లలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. వరుణ్ వివాహానికి వెళ్తే తనను చూసి అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అలా కాకూడదనే తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. అతడు తన కళ్లముందే పెరిగాడని గుర్తు చేసుకున్న రేణుదేశాయ్.. వరుణ్‌కు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.వరుణ్ తేజ్-నటి లావణ్య త్రిపాఠిల వివాహం రేపు ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వారి రెండు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. వివాహానంతరం నవంబరు 5న హైదరాబాద్‌లో సినీ ప్రముఖల కోసం రిసెప్షన్ నిర్వహిస్తారు.